పంచె కట్టులో సమంత...

  • IndiaGlitz, [Thursday,May 04 2017]

స్టార్ హీరోయిన్ స‌మంత పంచె క‌ట్టులో సంద‌డి చేయ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ డ్ర‌స్సుల‌తో పాటు సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో తెర‌పై క‌నువిందు చేసిన సమంత రావు ర‌మేష్‌తో క‌లిసి పంచెక‌ట్టులో ఉన్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అయితే ప్ర‌స్తుతం స‌మంత రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా, రాజుగారి గ‌ది2లో న‌టిస్తుంది. మ‌రి ఈ రెండు చిత్రాల్లో స‌మంత ఏ చిత్రంలో పంచెక‌ట్టులో క‌న‌ప‌డ‌నుందో తెలియాలంటే కొన్ని రోజుల ఆగాల్సిందే.