మరో విలక్షణ పాత్రలో సామ్
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్యతో పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టిన అక్కినేని సమంత. `యూటర్న్` తర్వాత `ఓ బేబీ` సినిమాలో నటించారు. ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. తదుపరి చిత్రం కూడా ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలోనే సమంత కనిపించనున్నారని సినీ వర్గాల సమాచారం.
వివరాల ప్రకారం .. `అర్జున్ రెడ్డి` డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరిశయ్య.. `అర్జున్ రెడ్డి` తమిళ రీమేక్ `ఆదిత్య వర్మ`తో దర్శకుడిగా మారారు. ఈ దర్శకుడు సమంతను డైరెక్ట్ చేయబోతున్నారట. ఈ చిత్రంలో సమంత క్యాబ్ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments