మాస్ పాత్ర‌లో స‌మంత‌

  • IndiaGlitz, [Sunday,December 03 2017]

'ఏం మాయ చేసావే' సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన హీరోయిన్ సమంత. తొలి తెలుగు మూవీతోనే జెస్సిగా అందరి హృదయాలని గెలుచుకుంది. 2017 సమంత జీవితంలో చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఆమె ప్రేమించిన నాగ చైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి కోడలైంది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.

ఇంతవరకు తన కెరీర్లో స్టైలిష్, క్లాస్ పాత్రలనే ఎక్కువ‌గా చేస్తూ వచ్చింది సామ్. తాజాగా.. ఓ త‌మిళ చిత్రంలో పూర్తిగా మాస్ అవతారంలో కనిపించనుందని సమాచారం. శివ‌కార్తీకేయ‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం కోసం.. పాత్ర డిమాండ్ మేరకు “కర్రసాము” కూడా నేర్చుకుందని త‌మిళ‌నాట వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ కళను నేర్చుకుంటున్నపుడు కొంత భయం, వణుకు కలిగాయని సామ్ వెల్లడించినట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. సినిమాపై ఉండే ఈ అంకితభావమే.. తనకు మంచి క్యారెక్టర్స్ దొరికేలా చేస్తున్నదని ఆమె సన్నిహిత వర్గం తెలియజేస్తోంది. అలాగే పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకుంటున్న'రంగస్థలం' సినిమాలో ఈ అమ్మడు రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది.

More News

వీరభద్ర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం టైటిల్ ఖరారు

కొత్త న‌టుడు శ్రీకాంత్ హీరోగా, హేమ‌ల‌త (బుజ్జి) హీరోయిన్ గా  వీర‌భ‌ద్ర క్రియేష‌న్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది  హేమ‌ల‌తా రెడ్డి నిర్మాత‌.

రామ్ సాయి గోకులం క్రియేషన్స్ 'ఆకలి పోరాటం'

గంగాధర్, రేణుక, హరీష్ వినయ్, హారిక హీరో, హీరోయిన్ లుగా రామ్ సాయి గోకులం క్రియేషన్స్ వారు ఆనంద్ సాగర్ దర్సకత్వం లో నిర్మించిన చిత్రం ఆకలి పోరాటం ఈ వారం లో రిలీజ్ కి సిద్దమవుతుంది.

సూర్య 'గ్యాంగ్' మూవీ ఫస్ట్ లుక్

స్టార్ హీరో సూర్యకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగాచెప్పక్కర్లేదు. సూర్య నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ అంతే భారీగా విడుదలౌతాయి.

డ‌బ్బింగ్‌లో వ‌రుణ్ తేజ్ చిత్రం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌థానాయ‌కుడుగా నటిస్తున్న తాజా చిత్రం 'తొలి ప్రేమ' (ప్ర‌చారంలో ఉన్న పేరు). డెబ్యు డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్నాడు.

లేడీ డాన్స్ మాస్టర్ తో బన్నీ

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి యువ క‌థానాయ‌కుల్లో బ‌న్నికి ఓ సెప‌రేట్ గుర్తింపు ఉంది. అదే డ్యాన్స్ బాగా చేస్తాడ‌ని. అందుకు త‌గిన‌ట్టు బ‌న్ని కూడా త‌న సినిమాల్లో డ్యాన్సులు ప్ర‌త్యేకంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు.