మాస్ పాత్రలో సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
'ఏం మాయ చేసావే' సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన హీరోయిన్ సమంత. తొలి తెలుగు మూవీతోనే జెస్సిగా అందరి హృదయాలని గెలుచుకుంది. 2017 సమంత జీవితంలో చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఆమె ప్రేమించిన నాగ చైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి కోడలైంది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఇంతవరకు తన కెరీర్లో స్టైలిష్, క్లాస్ పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చింది సామ్. తాజాగా.. ఓ తమిళ చిత్రంలో పూర్తిగా మాస్ అవతారంలో కనిపించనుందని సమాచారం. శివకార్తీకేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం.. పాత్ర డిమాండ్ మేరకు “కర్రసాము” కూడా నేర్చుకుందని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ కళను నేర్చుకుంటున్నపుడు కొంత భయం, వణుకు కలిగాయని సామ్ వెల్లడించినట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. సినిమాపై ఉండే ఈ అంకితభావమే.. తనకు మంచి క్యారెక్టర్స్ దొరికేలా చేస్తున్నదని ఆమె సన్నిహిత వర్గం తెలియజేస్తోంది. అలాగే పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకుంటున్న'రంగస్థలం' సినిమాలో ఈ అమ్మడు రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout