కొరియన్ సినిమాలో సమంత?
Send us your feedback to audioarticles@vaarta.com
2014లో విడుదలైన కొరియన్ చిత్రం 'మిస్ గ్రానీ' ని తెలుగులో రీమేక్ చేయడానికి సురేశ్ ప్రొడక్షన్స్ నిర్ణయించింది. సునీత తాటి కూడా ఇందులో భాగస్వామ్యం వహించనున్నారు. ఈసినిమాలో టైటిల్ పాత్ర కోసం సమంతను సంప్రదించారట. అందుకు సమంత కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. దర్శకురాలు నందిని రెడ్డి అయితే ఈ స్క్రిప్ట్ కు న్యాయం చేస్తుందని భావించి ఆమెను సంప్రదించారట.
ఆమె కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇందులో 20 ఏళ్ల అమ్మాయిగా, 70 ఏళ్ల ముదుసలిగానూ సమంత కనిపించనుంది. కామెడీ, ఎమోషన్ కలబోతగా ఈ సినిమా ఉండనుంది. సమంత ఇప్పటికే డిఫరెంట్ స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుని ముందుకు సాగుతున్నారు.
పెళ్లి కూతురై, పెళ్లై.. ఇన్నాళ్ల తర్వాత కూడా ఆమె బిగ్ బ్రేక్ ఎప్పుడూ తీసుకోలేదు. పెళ్లికి ముందుకన్నా... తర్వాతే జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నట్టు అనిపిస్తోందని నెటిజన్లు ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె నటించిన యు టర్న్ సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments