సమంత బాగా హర్ట్ అయ్యింది..
Saturday, July 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అటు కోలీవుడ్ - ఇటు టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్న ముద్దుగుమ్మ సమంత. యువ సమ్రాట్ నాగచైతన్య - సమంత ప్రేమించుకుంటున్నారు...త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే..ఈ వార్తల పై చైతన్య కానీ..సమంత కానీ స్పందించలేదు...అలాగని ఖండించలేదు. దీనికి తోడు ఇటీవల నాగార్జున ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ చైతన్య ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. నేను, అమల హ్యాఫీ అని అసలు విషయం చెప్పకనే చెప్పేసాడు. దీంతో ఇంకేముంది చైతు - సామ్ ల మ్యారేజ్ ఒకటే మిగిలివుంది త్వరలోనే ఎనౌన్స్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే...సమంతతో పరిచయం ఉన్న కొంత మంది ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారట. అలా గుచ్చి గుచ్చి డీటైల్స్ అడుగుతుండడంతో సమంతకి కోపం వచ్చింది. ఈ విషయాన్ని ఈరోజు ట్విట్టర్ ద్వారా సమంత తెలియచేసింది. ఇంతకీ సామ్ ఏమన్నది అంటే....నేను ఏం చేస్తాను..? ఎందుకు చేస్తాను అనే వాటికి కారణాలు నాకు తెలియాలి. నేను చెబితే మీకు తెలియాలి. నాకు ఫోన్ చేసి ప్రశ్నలు అడిగే వాళ్లకి షట్ అప్ అని చెప్పగలిగితే బాగుంటుంది అని అనుకుంటున్నా అంటూ తన బాధను వ్యక్తం చేసింది. పాపం...సమంత హర్ట్ అయ్యింది. ఇంతకీ... సమంతని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టింది ఎవరో...చెబితే ఎంత బాగుంటుందో..కదా..
Oh how I wish I could pick up the phone call a few ppl and ask them to 'SHUT THE beep UP' ya feel my gleaming positivity this morning?
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) July 2, 2016
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments