చిన్మయికి రీ ఎంట్రీ... సమంత అంతా చేసింది!
Send us your feedback to audioarticles@vaarta.com
మనం ఎదుగుతున్న క్రమంలో మన వాళ్లను, మనలను ఆరాధించేవాళ్లను, మనల్ని నమ్ముకున్న వారిని పట్టించుకోవాలి. మనమే ఎదగాలి, మన పక్కనున్న వాళ్లు అలాగే ఉండాలి, వీలైతే ఒక మెట్టు వాళ్లను తక్కువ చేయాలి అని అనుకోవడం నీచత్వం. కష్టం విలువ, తనను అభిమానించే వారి విలువ తెలుసుకోలేని వాళ్లే అలాంటి నీచత్వానికి దిగుతారు. కానీ సమంత అలాంటిది కాదు. తనను నమ్ముకున్న వారి బాగు కోరుతుంది. ఇప్పుడు ఆమె చేసిన సాయాన్ని చిన్మయి ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. `మీటూ` ఉద్యమంలో కాస్త గట్టిగా గళం వినిపించినప్పటి నుంచి చిన్మయికి తమిళంలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
తమిళంలో `96` సినిమాకు త్రిషకు డబ్బింగ్ చెప్పిన తర్వాత ఇప్పటిదాకా చిన్మయి ఇంకెవరికీ డబ్బింగ్ చెప్పలేదు. పాటలు కూడా పెద్దగా పాడింది లేదు. ఈ విషయాన్ని గుర్తించారు సమంత. ఆమె నటిస్తున్న `ఓబేబీ` సినిమా తమిళ వెర్షన్‌కి చిన్మయి చేత డబ్బింగ్ చెప్పించారు. ఈ సినిమా జులై 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిన్మయిట్వీట్ చేస్తూ ``దర్శకురాలు నందిని రెడ్డి, నాయిక సమంత వల్లనే ఇదంతా సాధ్యమైంది`` అని గర్వంగా చెప్పింది. దీనికి సమంత కూడా స్పందించింది. ఇద్దరు ఆడవాళ్లకు పడదని ఎవరన్నారు? ఇప్పుడు చిన్మయిని ఈ పురుషాధిక్యత ఉన్న ఇండస్ట్రీలో నిలబెట్టగలిగింది మరో ఇద్దరు స్త్రీలే కావడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout