సమంత మంచి మనసు

  • IndiaGlitz, [Wednesday,May 27 2020]

మంచి జరిగినప్పుడు సంతోష పడడం సాధారణమైన విషయం. అయితే మంచి జరిగినప్పుడు పదిమందికి సాయపడటం గొప్ప విషయం. ఇప్పుడు అక్కినేనివారి కోడలు సమంత అక్కినేని రెండో బాటలో ప్రయాణించి తను గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే... సోషల్ మీడియాలో యాక్టివేట్ గా ఉండే సమంత ను ఇన్ స్టా గ్రామ్ లో అయ్యే వారి సంఖ్య పది మిలియన్ లకు రీచ్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే తెలియజేసిన సమంత హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్ మెన్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని 10 ఎన్జీవోలకు సాయం చేస్తానని చెప్పింది.

అన్నట్లుగానే ఆశా కుటీర్, డిజైర్ సొసైటీ, అక్షయ ట్రస్ట్, వాల్మీకి పౌండేషన్, స్పందన సొసైటీ, మా ఇల్లు, భారతమాత సర్వీస్ సొసైటీ, లహరి ఓల్డ్ ఏజ్ హోమ్.. సహా మరికొన్ని సంస్థలకు సమంత సాయం చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే జాను తర్వాత సమంత మరో సినిమాను ఒప్పుకోలేదు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను చేయనుందని టాక్. అలాగే మరికొన్ని సినిమాల్లో నటించడానికి చర్చలు జరుపుతున్నారని సినీ వర్గాల సమాచారం. ఇది కాకుండా ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటించారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.

More News

మ్యాడ్ మూవీ లో కైలాష్ ఖేర్ పాడిన సూఫీ పాటకి మంచి స్పంద‌న

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్".ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసింది

'నిశ్శబ్దం' సెన్సార్ పూర్తి

అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "నిశ్శబ్దం". మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే, మైఖేల్ హడ్సన్ తదితరులు

వామ్మో.. నాగుపాముకే స్నానం చేయించాడు!

టైటిల్ చూడగానే.. ఇదేంటి.. పామును చూస్తేనే వణుకుపడుతుంది అలాంటిది స్నానం చేయించడమా..? అనే ఆశ్చర్యపోతున్నారా..?

‘పుష్ప’ లో యాంకర్ సుమ నటించడంపై క్లారిటీ..!

టాలీవుడ్ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అలియాస్ బన్నీ.. క్రియేటివ్‌ హెడ్‌గా పేరుగాంచిన సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : యువ నటి ఆత్మహత్య

కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్‌తో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఎలాంటి అవస్థలు పడుతున్నారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.