ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2 : ‘‘రాజీ’’కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్.. ఫుల్ జోష్‌లో సమంత

  • IndiaGlitz, [Friday,December 10 2021]

ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అయిన ‘‘ ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2’’ లో టాలీవుడ్ అగ్ర కథానాయిక స‌మంత న‌టించిన విష‌యం తెలిసిందే. దీనిలో స‌మంత పోషించిన రాజీ అనే పాత్రకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకుంది. ప్రేక్షకులు సైతం సమంత నటనకు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే రాజీ పాత్రకు గాను స‌మంతకు ‘‘ఫిల్మ్ ఫేర్ అవార్డు ’’ దక్కింది. ఈ విష‌యాన్ని ఫిల్మ్ ఫేర్ ప్ర‌తినిధులు అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఫిల్మ్ ఫేర్ ట్విట్‌కు స‌మంత థాంక్స్ అంటూ రీ ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్‌కు స్టార్ డైరెక్ట‌ర్స్ రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి తదితరులు నటించారు.

ఇప్పటివరకు సమంత తాను నటించిన ఏమాయ చేసావే.. ఈగ, నీతానే ఎన్ వసంతం చిత్రాలకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుంది. ప్రస్తుతం సమంత... అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసేసింది.

ఇకపోతే నాగ చైత‌న్య నుండి బ్రేకప్ జరిగిన త‌ర్వాత స‌మంత క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఆమెకు వ‌రుస ఆఫర్స్ క్యూ క‌డుతున్నాయి. అంతేకాదు ఏకంగా హాలీవుడ్ చిత్రంలోనే సమంత నటిస్తోంది. ‘‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’’ అంటూ రాబోతోన్న ఈ మూవీలో సమంత బై సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించబోతోందట. అలాగే య‌శోద అనే పాన్ ఇండియా చిత్రంలోను సమంత న‌టించనున్నారు.

More News

డిసెంబర్ 31న విడుదలవుతున్న రానా దగ్గుబాటి, సత్య శివ, సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి. '1945'

బాహుబలి లాంటి సినిమా తరువాత హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి భిన్న రకాల చిత్రాలను ఓకే చేశారు.

ల‌క్ష్య మూవీ స‌క్సెస్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - హీరో నాగ‌శౌర్య‌

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌ కోసం శ్రీరామ్ త్యాగం.. కాజల్‌ సెటైర్లు, మళ్లీ సిరి- షన్నూ హగ్గులు

బిగ్‌బాస్ 5 తెలుగులో రోల్ ప్లే టాస్క్ కంటిన్యూ అవుతోంది. అలాగే  టాస్కుల్లో బాగా ఆడిన వారికి ప్రజలను ఓట్లు అడిగే ఛాన్స్  ఇచ్చారు బిగ్‌బాస్.

బిగ్‌బాస్ 5 తెలుగు: నీ గురించి ఫైట్ చేస్తుంటే.. మీ అమ్మకి ‘‘హగ్’’ ఒక్కటే గుర్తుంది, సిరిపై షణ్ముఖ్ ఫైర్

బిగ్‌బాస్ 5 తెలుగులో తుది అంకానికి చేరుకుంది. ఇక ఒకే ఒక్క వారం షో మిగిలివుంది. నిన్న హౌస్‌లో జరిగిన టాప్ ఇన్సిడెంట్స్‌ని ఇంటి సభ్యులు చేసి చూపించారు.

మహేశ్ బ్రాండ్ లాగేసుకున్న రౌడీ స్టార్... స్పీడ్ మామూలుగా లేదుగా..!!

చిన్నా చితకా క్యారెక్టర్లు చేసుకునే స్థాయి నుంచి తెలుగులో టాప్ స్టార్ రేంజ్‌కు చేరుకున్నారు విజయ్ దేవరకొండ.