సాయిపల్లవి చేయాల్సిన పాత్రలో సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే కథానాయికల్లో సాయిపల్లవి ఒకరు. అందుకే వరుస అవకాశాలతో ముందుకు సాగిపోతోంది ఈ భామ. అయితే.. మంచి నటిగా సాయిపల్లవికి ఎంత పేరుందో.. ఈమెపై రెబల్ అనే ముద్ర కూడా అంతే ఉంది. తాజాగా.. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ నాయికా ప్రాధాన్యమున్న చిత్రం కోసం.. నిత్య మీనన్, సాయిపల్లవిని కథానాయికలుగా ఎంపిక చేశారు.
అయితే.. కొన్నికారణాల వల్ల ఇప్పుడు సాయిపల్లవి స్థానంలో సమంతను ఎంపిక చేసినట్టు సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. సాయిపల్లవి చెప్పిన టైమ్‌కు షూటింగ్‌కు రాకపోవడంతో పాటు.. చాలా ఇబ్బంది పెడుతోందని, ఈ ధోరణి నచ్చకే ఆమెను తప్పించినట్టు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘కణం’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం.. టైమ్‌కి వెళ్ళాలనే ఉద్దేశంతో.. అసిస్టెంట్ బైక్ పైనే వేదికకి చెప్పిన టైమ్ కంటే ముందుగా చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది సాయిపల్లవి. అలాంటి.. సాయిపల్లవిపై ఇలాంటి కథనాలు రావడం ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి.. సాయిపల్లవిపై వస్తున్న ఈ కథనాల్లో ఏ మాత్రం వాస్తవముందో కాలమే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com