సాయిపల్లవి చేయాల్సిన పాత్ర‌లో సమంత

  • IndiaGlitz, [Thursday,March 29 2018]

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే క‌థానాయిక‌ల్లో సాయిప‌ల్ల‌వి ఒక‌రు. అందుకే వరుస అవకాశాలతో ముందుకు సాగిపోతోంది ఈ భామ‌. అయితే.. మంచి నటిగా సాయిప‌ల్ల‌వికి ఎంత పేరుందో.. ఈమెపై రెబ‌ల్ అనే ముద్ర కూడా అంతే ఉంది.  తాజాగా.. మిస్కిన్ దర్శకత్వంలో రూపొంద‌నున్న ఓ నాయికా ప్రాధాన్య‌మున్న‌ చిత్రం కోసం.. నిత్య మీనన్, సాయిపల్లవిని క‌థానాయిక‌లుగా ఎంపిక చేశారు.

అయితే.. కొన్నికార‌ణాల వ‌ల్ల‌ ఇప్పుడు సాయిపల్లవి స్థానంలో సమంతను ఎంపిక చేసినట్టు సమాచారం. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. సాయిపల్లవి చెప్పిన టైమ్‌కు షూటింగ్‌కు రాకపోవడంతో పాటు.. చాలా ఇబ్బంది పెడుతోందని, ఈ ధోరణి నచ్చకే ఆమెను తప్పించినట్టు కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవ‌ల‌ హైదరాబాద్‌లో జరిగిన ‘కణం’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం.. టైమ్‌కి వెళ్ళాలనే ఉద్దేశంతో.. అసిస్టెంట్ బైక్‌ పైనే వేదికకి చెప్పిన టైమ్‌ కంటే ముందుగా చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది సాయిపల్లవి. అలాంటి.. సాయిప‌ల్ల‌విపై ఇలాంటి క‌థ‌నాలు రావ‌డం ఆమె అభిమానుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. మ‌రి.. సాయిప‌ల్ల‌విపై వ‌స్తున్న ఈ క‌థ‌నాల్లో ఏ మాత్రం వాస్త‌వముందో కాల‌మే చెప్పాలి.

More News

'జెమ్స్' ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో ఆల్బమ్ విడుదల

ఎస్ ఎన్ ఆర్ట్స్ క్రియేషన్స్. సమర్పణలో ఎస్ ఎన్ చిన్నా స్వీయ పరివేక్షణలో త్వరలో

శ్రీకాంత్ అడ్డాల మరో యూత్‌ఫుల్ మూవీ

‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’ చిత్రాల కోసం సహాయ ద‌ర్శ‌కుడిగా పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల పని తీరు నచ్చి..

వరుణ్ తేజ్ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటంటే..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి  కాంబినేష‌న్‌లో ఓ సినిమా  తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే.

అంగరంగ వైభవంగా ఎన్టీయార్ ప్రారంభోత్సవం

ప్రతి తెలుగువాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం "ఎన్టీయార్" బయోపిక్.

ఎన్టీఆర్ సినిమాలో జగపతి బాబు పాత్ర ఇదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ పూజా హెగ్డే జంటగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగ‌తి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.