Samantha:షూటింగ్లో సమంతకు ప్రమాదం.. రక్తం కారుతోన్న ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత షూటింగ్లో గాయపడ్డారు. ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోన్న ఆమె.. చిత్రీకరణ సమయంలో గాయపడ్డారు. ఆమె చేతికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని చూసిన అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం సమంత ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ కోసం సమంత తీవ్రంగా శ్రమిస్తున్నారు. మయోసైటిస్కు చికిత్స తీసుకుంటూనే మరోవైపు.. వెబ్‌సిరీస్ కోసం జిమ్‌లో కుస్తీలు పడుతున్నారు. సిటాడెల్లో సమంతతో పాటు బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోంది.
ఆధ్యాత్మిక మార్గంలో సమంత:
ఇదిలావుండగా.. జీవితంలో చోటు చేసుకున్న ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యల నుంచి సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో ఆమె బాగా క్రుంగిపోయారు. ఎక్కువగా ఇంటికే ఆమె పరిమితమవుతున్నారు. స్నేహితులతో తరచుగా ఔటింగ్‌కు వెళ్లే విషయంలోనూ సమంత పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తన ఆరోగ్యం, కెరీర్‌కే ఆమె ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇదిలావుండగా.. జీవితంలో ఇబ్బందుల రీత్యా సామ్ పూర్తి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోయారు.
600 మెట్లెక్కి పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్న సమంత:
ఈ మధ్యకాలంలో ఏమాత్రం ఖాళీ దొరికినా దేవాలయాలను సందర్శిస్తున్నారు సమంత. తాజాగా తమిళనాడులోని ప్రఖ్యాత పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించారు సామ్. దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయాన్ని దర్శించాలంటే దాదాపు 600కు పైగా మెట్లు ఎక్కాలి. ప్రస్తుత మయోసైటిస్ కారణంగా కండరాలు ఇబ్బంది పెడుతున్నా లెక్కచేయకుండా సామ్ 600 మెట్లను ఎక్కేశారు. అంతేకాదు.. ప్రతి మెట్టుకూ కర్పూరం వెలిగిస్తూ.. ముందుకు సాగారు. ఆమె కోసం తమిళ దర్శకుడు సీ ప్రేమ్ కుమార్ దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments