ఏడ్చేసిన సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత అక్కినేని టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `ఓ బేబీ`. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం చాలా పెద్ద విజయాన్ని సాధించింది. సినిమాలో సమంత అద్భుతంగా నటించిందంటూ అన్ని మీడియాల్లో ఆమె నటన గురించి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రివ్యూలు కూడా సినిమాను అప్రిషియేట్ చేస్తున్నాయి. వీటిని చూసిన సమంత ఓ వెబ్‌సైట్ అయితే సమంత వల్లనే ఈ విజయం సాధ్యమైందంటూ రాసింది. దీనికి సమంత రిప్లై ఇస్తూ.. ఈ రివ్యూ చదివి నేను ఏడ్చేశా. ఇది నేను కష్టపడి పనిచేసేందుకు ఎంతో స్ఫూర్తినిచ్చింది.
ఓ మీడియా సంస్థ సామ్ అదరగొట్టేసింది అని రాయగా.. దానికి సామ్.. ఇప్పుడు ఇంటికెళ్లి నిద్రపోతా. ధన్యవాదాలు అంటూ స్పందించారు. తమిళ స్టార్ ధనుష్ కూడా ఓ డ్యాన్సింగ్ వీడియోను పోస్ట్ చేసి ఇది ఓ బేబీ యూనిట్ చిత్ర బృందం ఫీలింగ్ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. కొరియన్ చిత్రం మిస్ గ్రానీకి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి తెరకెక్కించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments