అప్పుడు గుండె పగిలేలా ఏడ్చాను: సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లి తర్వాత కూడా డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి క్రేజ్‌ను, విజయాలను సొంతం చేసుకుంటుంది సమంత. ఈమెకు కుక్కలంటే చాలా ఇష్టం. కుక్కను పెంచాలని అనుకున్నప్పుడు ఓ నెలరోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణను కూడా తీసుకుంది. బూగబూ అనే ఓ జాతి కుక్కను తెచ్చి పెంచుకోవడం మొదలు పెట్టింది. అయితే ఆ కుక్కకు పార్వో అనే వైరస్ వ్యాధి సోకి చనిపోయింది. తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క నాలుగు నెలల్లోనే చనిపోవడంతో సమంత చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యిందట. ఆ కుక్క చావుకు కారణం తనేనని భావించి గుండెలు పగిలేలా ఏడ్చానని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది.
ఇంతకు ఇదంతా సమంత ఎందుకు చెప్పిందో తెలుసా? భర్త చైతన్య అక్కినేని రెండు కుక్క పిల్లలు హష్, డోగ్రోలను పెంచుకుంటున్నాడు. ఆ రెండు పిల్లల్లో హష్కి ఏడాది వయసు పూర్తయ్యింది. దీని పుట్టినరోజుని ఘనంగా సెలబ్రేట్ చేశారు చై, సామ్‌లు. ఈ సందర్భంగా సమంత ఎమోషనల్ అయ్యి తన బూగబూ గురించి చెబుతూ తన బాధను పంచుకుంది. అయితే బూగబూ చనిపోయిన తర్వాతే చైతన్య హష్‌ను పెంచుకుందామని ఇంటికి తెచ్చాడు. హష్కి కూడా ఎక్కడ వైరస్ వ్యాధి సోకుతుందోనని సమంత చాలా గాభరా పడింది. స్పెషల్ డాక్టర్ని నియమించింది. చివరకు హష్‌కు ఏడాది వయసు నిండింఇ. ఇప్పుడు సమంత, చైతన్య హష్ పుట్టినరోజును ఘనంగానే సెలబ్రేట్ చేశారు. సమంత చేసిన పోస్ట్‌కు ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హార్ట్ సింబల్‌తో తన స్పందనను తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments