సమంత ఫేవరేట్ ప్రాజెక్ట్.. ఫిబ్రవరి నుంచి
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత ఫేవరెట్ ప్రాజెక్ట్ 'యు-టర్న్' మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం.. 2016లో కన్నడలో విడుదలైన ఈ థ్రిల్లర్ మూవీని సమంత ప్రధాన పాత్రధారిణిగా తెలుగు, తమిళ భాషల్లో పునః నిర్మిస్తున్నారు. కన్నడ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఇప్పుడు తెలుగు, తమిళంలో కూడా డైరెక్షన్ చేయబోతున్నారని సమాచారం.
కాగా...ఈ ఫిబ్రవరి నుంచి రెండు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. కన్నడంలో శ్రద్ధ శ్రీనాథ్ పోషించిన విలేకరి పాత్రని సమంత పోషిస్తున్నారు. హత్యా రహస్యాన్ని ఛేదించే ఒక మహిళా విలేకరి పాత్రలో తన ప్రతిభని నిరూపించుకుంటానంటున్నారు సమంత. గతంలో ఒకసారి రిపోర్టర్ పాత్రలో నటించాలని ఉందని ఆమె స్వయంగా వెల్లడించారు. యు-టర్న్ మూవీని రీమేక్ చేయడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు. పెళ్లి తర్వాత ఆమె ఒప్పుకున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై రెండు భాషల్లోనూ నిర్మిస్తున్నారు. ఇక సమంత నటిస్తున్న రంగస్థలం`, మహానటి`, అలాగే తమిళ అనువాద చిత్రం అభిమన్యుడు` మార్చి నెలలో విడుదల కానుండగా....తమిళంలో శివకార్తికేయన్, విజయ్ సేతుపతి సరసన నటిస్తున్న సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com