సమంత అభిమానుల కౌంటర్ అటాక్ షురూ..
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత అక్కినేని నటించిన తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి తమిళనాడులో వివాదం మొదలైంది. ఫ్యామిలీ మ్యాన్ 2పై తమిళులు గుర్రుగా ఉన్నారు. ట్రైలర్ లో సమంత పాత్రని చూపించిన విధంగా తమ మనోభావాలు కించపరిచే విధంగా ఉందంటూ కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయంగా కూడా రచ్చ చెలరేగింది. ఈ వెబ్ సిరీస్ విడుదల నిలిపివేయాలంటూ తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. కానీ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ యూనిట్ మాత్రం ఈ నిరసనలని పెద్దగా పట్టించుకోలేదు. రిలీజ్ కు టైం దగ్గరపడుతుండడంతో సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది.
ఇదీ చదవండి: బ్లాక్ బ్లౌజ్ లో కాకరేపుతున్న ఈషా.. దివి థైస్ అందాలు
ట్విట్టర్ లో సమంతకు వ్యతిరేకంగా 'షేమ్ ఆన్ యు సమంత' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. సమంతపై ట్రోలింగ్ జరుగుతుండడంతో ఆమె అభిమానులు కూడా రంగంలోకి దిగారు. 'వి సపోర్ట్ సమంత' అనే హ్యాష్ ట్యాగ్ తో సమంతకు మద్దతు తెలుపుతున్నారు.
సమంత ఈ వెబ్ సిరీస్ లో టెర్రరిస్ట్ పాత్రలో నటిస్తోంది. తొలిసారి సమంత యాక్షన్ సీన్స్ లో నటించింది. ఈ వివాదం సంగతి ఎలా ఉన్నా.. ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం చాలా మందే ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com