సమంత ఎంటర్టైన్మెంట్తో పాటు.. ఏడిపించబోతోంది..
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 4. వీకెండ్‌కి సమంత రాబోతోంది. ఈ రోజు షో మొత్తం ఆమెదే. ఇవాళ ప్రోమోను స్టార్ మా యాజమాన్యం విడుదల చేసింది. ఐదు నిమిషాల పాటు ఉన్న ఈ ప్రోమోలో నవ్వించింది.. బెదిరించింది. ఫైనల్‌గా ఏడిపించేసింది కూడా. ‘నాపైనే పంచులా.. చూసుకుంటా’ అంటూ బెదిరిస్తూ సామ్ సందడి సందడి చేసింది. తనే కాదు తనతో పాటు హైపర్ ఆది, పాయల్ రాజ్‌పుత్, కార్తికేయ, ఫైనల్‌గా అక్కినేని అఖిల్‌ని కూడా తీసుకువచ్చింది.
ఇక హైపర్ ఆది.. తన పంచులతో షోను మరింత ఆసక్తికరంగా మార్చేశాడు. బయట పాయల్.. షోలో మోనాల్ అంటూ కామెడీ చేశాడు. ఇక అవినాష్‌ని అయితే ఆడుకున్నాడు. నా పేరులోనూ ‘ఎ’ ఉందని చెప్పాడు. అఖిల్‌ని.. గంగవ్వను అవ్వలా చూసుకున్నావని.. మోనాల్‌ని ఎవరిలా చూసుకుంటున్నావని ప్రశ్నించాడు. ఇలా ఫన్నీ ఫన్నీగా షో నడవనుంది. ప్రోమోనే ఇలా ఉంటే.. షో మరింకెలా ఉండబోతోందో చూడాలి.
ఇక బిగ్‌బాస్ షోలో ప్రస్తుతమున్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు వారి గురించి మాట్లాడుతున్న వీడియోలను వేసి చూపించింది. కుటుంబ సభ్యులు తమ గురించి మాట్లాడుతుంటే కంటెస్టంట్లంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మొత్తమ్మీద దసరాకు సామ్ అంతా తానై నడిపించబోతోందనడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com