స‌మంత‌.. డ‌బుల్ ధ‌మాకా

  • IndiaGlitz, [Thursday,December 07 2017]

యువ క‌థానాయకుడు నాగ‌చైత‌న్య‌ని ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న స‌మంత‌.. మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా మారింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో రామ్‌చ‌ర‌ణ్‌తో రంగ‌స్థ‌లం చేస్తున్న స‌మంత‌.. మ‌హాన‌టిలో ఓ కీల‌క పాత్ర చేస్తోంది. ఇక త‌మిళంలో విశాల్‌, విజ‌య్ సేతుప‌తి, శివ‌కార్తీకేయ‌న్‌తో సినిమాలు చేస్తోంది.

ప్ర‌స్తుతం స‌మంత చేస్తున్న తెలుగు చిత్రాల‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఉంది. అదేమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశం ఉండ‌డం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత న‌టిస్తున్న తొలి చిత్రం రంగ‌స్థ‌లం వేస‌వి కానుక‌గా మార్చి 29న విడుద‌ల కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే.. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. స‌రిగ్గా అదే రోజున స‌మంత కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న మ‌హాన‌టిని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు బుధ‌వారం చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అంటే.. ఒకే రోజున స‌మంత రెండు చిత్రాల‌తో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంద‌న్న‌మాట‌. మ‌రి.. స‌మంత డ‌బుల్ ధ‌మాకా ఎంత‌వ‌ర‌కు వ‌ర్కవుట్ అవుతుందో చూడాలి.

More News

హ‌లో.. ర‌మ్య‌కృష్ణ‌కి ఎంతో స్పెష‌ల్‌

ర‌మ్య‌కృష్ణ‌.. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ హీరోయిన్‌. ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌. అయితే అప్పుడు.. ఇప్పుడు.. ఒక పాయింట్ మాత్రం కామ‌న్‌. అదేమిటంటే.. ఎలాంటి పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోవ‌డం.

అను.. మెగా నామ సంవ‌త్స‌రం?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.. ఇలా ఈ ముగ్గురు మెగా హీరోస్ తో జోడీక‌ట్టిన క‌థానాయిక‌లుగా త‌మ‌న్నా, శ్రుతి హాస‌న్‌, కాజ‌ల్‌, స‌మంత‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది.

నేను అఖిల్ ని ఎలా చూడాలనుకున్నానో అలా 'హలో'లో చూశాను - నాగార్జున

యూత్ కింగ్అఖిల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శిన్హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్అండ్మనం ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో 'మనం' ఫేమ్విక్రమ్కె.కుమార్దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్చిత్రం 'హలో'.

'ఆక్సిజన్' భవిష్యత్ తరాలు తప్పక చూడాల్సిన చిత్రం

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్". గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించారు.

మ‌హేష్ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ ఆ రోజేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న సినిమా 'భరత్ అనే నేను' (ప్ర‌చారంలో ఉన్న పేరు).  ఇందులో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.