వెబ్ సిరీస్ చేస్తున్న సమంత దర్శకుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత 'యూ టర్న్' వంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన దర్శకుడు పవన్‌కుమార్. అంతకు ముందు కన్నడంలో లూసియా, యూటర్న్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈయన లైలా అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. నెట్‌ఫ్లిక్స్ చేయబోయే ఈ వెబ్ సిరీస్‌ను దీపా మెహతా, శంకర్ రామన్ డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రగ్యా అక్బర్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను చేయబోతున్నారట. పదహరేళ్లకు ముందు తప్పిపోయిన తన కూతురిని వెతికే తల్లికి సంబంధించిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దేవాకట్టా, ప్రవీణ సత్తారు తర్వాత దక్షిణాది నుండి నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్ చేయబోతున్న మూడో దర్శకుడు పవన్‌కుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments