Samantha: సమంతకు గుడి .. ఏకంగా ఇంట్లోనే, ఎవరా వీరాభిమాని..?

  • IndiaGlitz, [Wednesday,April 26 2023]

భారతదేశంలో సినీ తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు వారిని తమ ఇంట్లో మనిషికన్నా ఎక్కువగా భావిస్తారు. గుడి కట్టి పూజలు చేయడమే కాదు.. అచ్చంగా వాళ్లనే అనుకరిస్తారు. ఇక అభిమాన నటుల పుట్టినరోజులు, సినిమా విడుదలల సందర్భంగా చేసే హడావుడి మామూలుగా వుండదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటీ వరకు ఎంతోమంది వ్యక్తులు తమ అభిమాన తారల విగ్రహాలను ప్రతిష్టించి వాటికి పూజలు చేసిన సందర్భాలు ఎన్నో.

తమిళనాడులో పలువురు నటీమణులకు గుళ్లు :

తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరిపోయారు సమంత. గతంలో ఖుష్బూ, నమిత, హన్సికా మోత్వాని , నయనతారలు అందుకున్న గౌరవాన్ని సామ్ కూడా అందుకోనున్నారు. తమిళనాట ఈ హీరోయిన్ల అభిమానులు నిర్మించిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. ఇప్పుడు సమంత కోసం ఓ గుడి కట్టనున్నారు. అయితే ఈ అభిమాని మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. బాపట్ల సమీపంలోని ఆలపాడు గ్రామంలో ఆమె కోసం తెనాలి సందీప్ అనే వ్యక్తి ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఆలయ నిర్మాణం పూర్తి కాగా.. ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజును పురస్కరించుకుని దానిని ప్రారంభించనున్నారు.

ఆ సేవే నన్ను ఆకట్టుకుందన్న అభిమాని:

అయితే సందీప్ అనే వ్యక్తి.. సమంతను ఇంతవరకు నేరుగా కలవలేదు. ఆమెను ఎప్పటికైనా కలవాలనేది అతని కల. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమంత చేస్తున్న ఛారిటీ వర్క్ చూసి తాను ఆమెకు పెద్ద ఫ్యాన్‌ను అయినట్లు సందీప్ చెప్పాడు. అనారోగ్యం పాలైన పిల్లలకు సమంత పునర్జన్మ ప్రసాదిస్తున్నారని.. అందుకే ఆమెకు గుడికట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఇందుకోసం తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయం కోసం స్థలం కేటాయించాడు, అంతేకాదు సమంత విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. ప్రస్తుతం విగ్రహానికి, ఆలయానికి తుది మెరుగులు దిద్డుతున్నారు.