చై, సామ్ మళ్లీ కలుస్తారా..?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సెలబ్రెటీ కపుల్స్ సమంత - నాగచైతన్య విడాకులు తీసుకోవడాన్ని పరిశ్రమతో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటంటూ తెగ బాధపడ్డారు. ఆ తర్వాత సమంత వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కథనాలు రావడం.. ఆమె కోర్టుకెక్కడం వంటివి జరిగిపోయాయి. చై సామ్‌లు మళ్లీ కలిస్తే బాగుండు అంటూ కొందరు నేటికీ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అది కూడా సమంత వైపు నుంచి.
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి విడాకుల ప్రకటనకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ నోట్‌ను డిలీట్ చేశారు సామ్. ఈ చర్య ప్రస్తుతం వైరల్ అవుతోంది. సమంత అలా ఎందుకు చేసింది.. వీళ్లిద్దరూ మళ్లీ ఏమైనా కలుసుకునే ఆలోచనలో ఉన్నారా? అంటూ రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నాగచైతన్య ఇన్‌స్టా హ్యాండిల్‌లో మాత్రం విడాకుల స్టేట్‌మెంట్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకవేళ ఇద్దరూ మళ్లీ కలిసి పోవాలని నిర్ణయం తీసుకుంటే చైతూ కూడా స్టేట్‌మెంట్‌ను డిలీట్ చేయాలిగా.. కానీ అలా జరగలేదు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. సమంత ఇన్‌స్టాగ్రామ్‌ను క్లీన్ చేసే ప్రాసెస్‌లో విడాకుల ప్రకటన నోట్ కూడా డిలీట్ అయ్యిందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే లవ్‌స్టోరీ, బంగార్రాజు హిట్‌లతో నాగ చైతన్య మంచి జోరు మీద వున్నారు. వీటితో పాటు ‘‘థాంక్యూ’’ , బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌తో కలిసి ‘‘లాల్ సింగ్ చద్దా’’ సినిమాలో నటించారు. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లోనూ నాగ చైతన్య నటించబోతున్నారు. సమంత విషయానికి వస్తే.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఆమె.. ‘‘యశోద’’ వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే జాన్ పిలిప్ దర్శకత్వంలో అరెంజ్‌మెంట్ ఆఫ్ లవ్ అనే ఇంటర్నేషనల్ మూవీలోనూ సమంత నటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com