'రంగస్థలం' ప్రయాణం ప్రత్యేక మంటున్న సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం`. సుకుమార్ దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథలో సమంత పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా, ఈ చిత్రంలో మూగ అమ్మాయి పాత్రలో సమంత నటిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా తన పాత్రకి సంబంధించిన చిత్రీకరణని ముగించుకున్నారు ఈ అక్కినేని ఇంటివారి కోడలు. అలాగే...స్పెషల్ టీంతో సాగించిన ఈ ప్రయాణం చాలా ప్రత్యేకంగా ఉంది అంటూ...రామ్ చరణ్, సుకుమార్ వారి స్టార్ డమ్‌కి తగినట్టుగానే ఈ చిత్రాన్ని చిత్రీకరించారని సోషల్ మీడియాలో ఈ సినిమా అనుభవాలను పంచుకున్నారు సమంత. కాగా, సమంత పాత్ర ఫస్ట్ లుక్ ను కూడా త్వరలోనే అఫీషియల్‌గా విడుదల చేయనుంది చిత్ర యూనిట్. వేసవి సందర్భంగా మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో.. సమంత నటించిన మహానటి`, తమిళ అనువాద చిత్రం అభిమన్యుడు`కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments