ఫేవరెట్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
2018.. ప్రథమార్థం సమంతకు బాగా కలిసొచ్చింది. గడచిన ఈ ఆరు నెలల్లో ఆమె కథానాయికగా నటించిన 'రంగస్థలం' తెలుగులో ఘన విజయం సాధించగా.. 'మహానటి', 'అభిమన్యుడు' చిత్రాలైతే ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సామ్.. మరో బైలింగ్వల్ మూవీని పూర్తి చేసారు.
ఆ వివరాల్లోకి వెళితే.. సమంత ఫేవరెట్ ప్రాజెక్ట్ కన్నడ ఫిల్మ్ 'యు టర్న్' సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సామ్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఒక హైవే పై జరిగే వరుస హత్యలకు సంబంధించిన మిస్టరీని చేధించే నేపథ్యంలో.. పోలీసులకు ఓ జర్నలిస్ట్ ఏ విధంగా సాయపడిందో తెలిపే ఇతివృత్తమే ఈ సినిమా. కన్నడ వెర్షన్ డైరెక్టర్ పవన్ కుమార్ ఈ బైలింగ్వల్ మూవీని కూడా రూపొందించారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా.. షూటింగ్ పార్టును పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఇక వచ్చే వారం నుంచి సామ్ డబ్బింగ్‌ను కూడా ప్రారంభించనున్నట్టు చెబుతున్నారు. భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవిచంద్రన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా.. మరో రెండు నెలల్లో విడుదల కానునట్టు సమాచారం
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com