ఛాలెంజ్‌ను పూర్తి చేసిన సమంత‌...

  • IndiaGlitz, [Saturday,May 26 2018]

హ‌మ్ ఫిట్‌తో ఇండియా ఫిట్ హై అనే ఛాలెంజ్‌ను కేంద్ర క్రీడ‌ల మంత్రి రాజ్య‌వ‌ర్ద‌న్ సింగ్ రాథోడ్ స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హృతిక్‌ రోషన్‌, సైనా నెహ్వాల్‌, విరాట్‌ కోహ్లీకు సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. ఆయ‌న విసిరిన ఛాలెంజ్‌ను వారు పూర్తి చేశారు. ఇది వైర‌ల్ అయ్యింది. ఈ సంద‌ర్బంగా హీరో అఖిల్ తన సోద‌రుడు చైత‌న్య‌కు స‌వాల్ విసిరారు.

అఖిల్ స‌వాల్‌ను స్వీక‌రించిన చైత‌న్య ఎక్స‌ర్‌సైజులు చేసి స‌మంత‌, సుశాంత్‌, నిధి అగ‌ర్వాల్‌కు ఛాలెంజ్ విసురుతున్నా అన్నారు. దీన్ని స‌మంత స్వీక‌రిస్తూఫుల్ అప్ చేసిన వీడియో పోస్ట్ చేసింది. చాలా రోజులుగా జిమ్ ట్రైన‌ర్ పుల్ అప్ చేయ‌మ‌ని అంటుంటే..క‌డుపు నొప్పి, ప‌ళ్లునొప్పి, త‌ల‌నొప్పి అంటూ త‌ప్పించుకంటూ వ‌స్తున్నాను. చివ‌ర‌కి పుల్ అప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించా.. ఉపాస‌న‌, శిల్పారెడ్డి, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ల‌కు నేను ఛాలెంజ్ విసురుతున్నాను అంటూ స‌మంత ఛాలెంజ్ విసిరారు.