ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం 'ఏ మాయ చేశావే' కోసం జెస్సీగా కనిపించి.. కుర్రకారు మనసులని తన అందం, అభినయంతో దోచుకున్నారు చెన్నై బ్యూటీ సమంత. 2010లో సరిగ్గా ఇదే ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమాతో ప్రారంభమైన సమంత సినీ ప్రయాణం.. నేటితో 8 ఏళ్ళు పూర్తిచేసుకుంది. మొదటి సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డుతో పాటు చిత్ర కథానాయకుడు నాగచైతన్య మనసును కూడా గెలుచుకున్నారు ఈ ముద్దుగుమ్మ. కట్ చేస్తే.. 2017లో అదే నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టారు సమంత.
ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే 'ఏ మాయ చేశావే', 'బృందావనం', 'దూకుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేగాకుండా.. 'ఈగ' (2012), 'అత్తారింటికి దారేది'(2013) 'మనం'(2014), 'అఆ'(2016) సినిమాల్లో అభినయానికి అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు.
ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న 'రంగస్థలం'తో పాటు తమిళ చిత్రాలు 'ఇరుంబుత్తిరై', 'సీమరాజా', 'సూపర్ డీలక్స్', బైలింగ్వల్ మూవీ 'యు టర్న్', మల్టీలింగ్వల్ 'మహానటి' చిత్రాల్లో కూడా సమంత నటిస్తున్నారు. పెళ్ళయ్యాక కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. మున్ముందు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com