సమంత ఛాలెంజ్.. సక్సెస్ అవుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్డౌన్ సమయంలో సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమై కొత్త విషయాలు నేర్చుకోవడమే కాకుండా.. సరికొత్త ఛాలెంజ్‌లు విసురుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత అక్కినేని ఓ ఛాలెంజ్‌తో కొత్త పనికి శ్రీకారం చుట్టారు. ఇంతకూ సమంత ఏ ఛాలెంజ్ విసిరిందో తెలుసా? ‘గ్రో విత్ మీ ఛాలెంజ్’ అంటూ సమంత ముందుకు వచ్చారు. ఈ ఛాలెంజ్‌లో సేంద్రీయ వ్యవసాయం చేయాలని సమంత సూచించారు. అందుకోసం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలు పండిద్దామని, కుండ, ఖాలీ పాల ప్యాకెట్, విత్తనాలు, హైడ్రో ఫోనిక్ కిట్‌ను తయారు చేసుకుని కూరగాయలను పండించాలని సమంత వీడియోలో కోరారు. అంతే కాకుండా ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లాలంటూ మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్‌సింగ్‌లను నామినేట్ చేశారు సమంత.
సాధారణంగా.. ఏదో పనిచేసే ఛాలెంజ్ అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారు. కానీ వ్యవసాయం చేయడం. అది కూడా సేంద్రీయ వ్యవసాయం చేయడం అంటే కాస్త ఓపికగా చేయాల్సిన వ్యవహారం. మరి ఈ ఛాలెంజ్ ఎంత వరకు ముందుకెళుతుందోననేది ఆసక్తికరంగా, అనుమానంగా మారింది. మరి సమంత కొత్త ఛాలెంజ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments