స‌మంత ఛాలెంజ్‌.. స‌క్సెస్ అవుతుందా?

  • IndiaGlitz, [Friday,August 21 2020]

లాక్‌డౌన్ స‌మయంలో సినీ సెల‌బ్రిటీలు ఇంటికే ప‌రిమిత‌మై కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డ‌మే కాకుండా.. స‌రికొత్త ఛాలెంజ్‌లు విసురుతున్నారు. ఈ క్ర‌మంలో స్టార్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు స‌మంత అక్కినేని ఓ ఛాలెంజ్‌తో కొత్త ప‌నికి శ్రీకారం చుట్టారు. ఇంత‌కూ స‌మంత ఏ ఛాలెంజ్ విసిరిందో తెలుసా? ‘గ‌్రో విత్ మీ ఛాలెంజ్‌’ అంటూ సమంత ముందుకు వచ్చారు. ఈ ఛాలెంజ్‌లో సేంద్రీయ వ్య‌వ‌సాయం చేయాల‌ని స‌మంత సూచించారు. అందుకోసం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. సేంద్రీయ ప‌ద్ధ‌తుల్లో కూర‌గాయ‌లు పండిద్దామ‌ని, కుండ‌, ఖాలీ పాల ప్యాకెట్‌, విత్త‌నాలు, హైడ్రో ఫోనిక్ కిట్‌ను త‌యారు చేసుకుని కూర‌గాయ‌ల‌ను పండించాల‌ని స‌మంత వీడియోలో కోరారు. అంతే కాకుండా ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లాలంటూ మంచు ల‌క్ష్మి, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ల‌ను నామినేట్ చేశారు స‌మంత‌.

సాధార‌ణంగా.. ఏదో ప‌నిచేసే ఛాలెంజ్ అంటే ఎవ‌రైనా పార్టిసిపేట్ చేస్తారు. కానీ వ్య‌వ‌సాయం చేయ‌డం. అది కూడా సేంద్రీయ వ్య‌వ‌సాయం చేయ‌డం అంటే కాస్త ఓపిక‌గా చేయాల్సిన వ్య‌వ‌హారం. మ‌రి ఈ ఛాలెంజ్ ఎంత వ‌ర‌కు ముందుకెళుతుందోన‌నేది ఆస‌క్తిక‌రంగా, అనుమానంగా మారింది. మ‌రి స‌మంత కొత్త ఛాలెంజ్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

More News

డీ గ్లామ‌ర్ పాత్ర‌లో ర‌కుల్‌..?

తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు అడ‌పా ద‌డ‌పా హిందీ చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

రావ‌ణుడి పాత్ర‌కు ఆ స్టార్ ఓకే అంటాడా?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగారు. ఇప్పుడు ప్ర‌భాస్ చేస్తున్న మూడు సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలే కావ‌డం విశేషం.

ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎంజీఎం

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా తిరిగి రావాలని దేశం మొత్తం కాక్షింస్తోంది. కరోనాతో పోరాడుతున్న ఆయన ఆరోగ్యంలో మార్పేమీ లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఆగ‌స్ట్ 26 నుంచి కెజిఎఫ్‌2 బ్యాలెన్స్‌ షూటింగ్ ప్రారంభం

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా.. కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో

ఏపీలో కొత్తగా 9544 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ మరణాలు సైతం వందకు చేరువలో నమోదవుతూ ప్రజానీకాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి.