Pic Talk : క్రాప్ టాప్‌లో సమంత హాట్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత గ్లామర్ డోసు బాగా పెంచారు సమంత. ఫ్రెండ్స్‌తో పిక్నిక్లు, హాట్ ఫోటో షూట్, ట్రెండీ వేర్లతో ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నామధ్య సమంత బ్రా పిక్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఆమె మునుపెన్నడు ఇలాంటి డ్రెస్ ధరించలేదు. పుష్ప ఐటెం సాంగ్ లో వల్గర్ గా కనిపించినా..అది సినిమాలో భాగమని వదిలేసారు జనాలు. కానీ, ప్రస్తుతం సమంత డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఆడియన్స్ అవాక్కవుతున్నారు.
అయితే ఎవరేం అనుకున్నా పట్టించుకునే రకం కాదు సమంత. తనకు నచ్చిన దారిలోనే ఆమె వెళ్తారనే విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా సామ్ పోస్ట్ చేసిన ఫోటోషూట్ హాట్ హాట్‌గా మారింది. ఇందులో క్రాప్ టాప్‌లో హల్ చల్ చేసింది. పైగా గ్లామర్ డోస్ మరింత పెంచినట్లుగా కనిపిస్తోంది. పైగా ఎక్స్‌ప్రెషన్స్‌తో అటాక్ చేస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత నటించిన ‘యశోదా’ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా థ్రిల్లర్. దీనితో పాటు అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌లో నటించేందుకు సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
మరోవైపు.. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్.. ‘‘ కాఫీ విత్ కరణ్’’ అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ షో ఎంతో పాపులర్. మొదటి భాగం విజయవంతం కాగా, రెండో భాగం ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షోకి గెస్ట్‌గా సమంత పాల్గొన్నారు. ఈ క్రమంలో దక్షిణాదితో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ హాట్ టాపిక్‌గా వున్న చైతూతో విడాకులపై కరణ్ అడిగిన ప్రశ్నకు సామ్ సూటిగా జవాబిచ్చిందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. విడాకులకు దారి తీసిన పరిస్థితుల గురించి సమంత వివరంగా చెప్పేసిందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఈ షో ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా? అని సినీ జనాలతో పాటు అభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments