స‌మంత ద్విభాషా చిత్రం?

  • IndiaGlitz, [Friday,December 27 2019]

ఒక్కో దర్శకుడు ఒక్కొక్క స్టైల్లో సినిమా తీస్తుంటాడు. కొంద‌రు దర్శకులు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ తీస్తే.. మరికొంతమంది థ్రిల్లర్స్‌ను ఎంచుకుంటుంటారు. ఇలా రీసెంట్ టైమ్‌లో థ్రిల్ల‌ర్ జోనర్‌లో లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ తీసే ఓ కోలీవుడ్ డైరెక్టర్.. ఇప్పుడో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌తో సినిమా చేయబోతున్నాడట. మేల్‌ డామినేటెడ్‌గా చెప్పుకునే సినీ ఇండస్ట్రీలో.. కథానాయకులకు దీటుగా రాణిస్తున్నారు కథానాయికలు. ఆ క్రేజ్‌తో హీరోయిన్స్‌నే ప్రధాన పాత్రలుగా పెట్టి కథలు సిద్ధం చేసుకుంటుంటారు కొంతమంది ఔత్సాహిక దర్శకులు. ఈకోవలో.. తమిళ యువ దర్శకుడు అశ్విన్ శరవణన్ ముందున్నాడు. థ్రిల్లింగ్ జానర్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ కోలీవుడ్ డైరెక్టర్.. లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్ స్పెషలిస్ట్‌గా మారాడు.

నాలుగేళ్ల క్రితం లేడీ సూపర్‌స్టార్ నయనతారతో తమిళంలో 'మాయ' తెరకెక్కించాడు అశ్విన్. నయనతార 50వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం తమిళంలో ఒన్‌ ఆఫ్‌ ద బెస్ట్ హారర్ థ్రిల్లర్‌గా నిలిచింది. తెలుగులో ఈ సినిమా 'మయూరి' పేరుతో అనువాదమైంది. 'మాయ' తర్వాత మరోసారి థ్రిల్లింగ్ జానర్‌లో.. తాప్సీ కథానాయికగా 'గేమ్ ఓవర్' చిత్రాన్ని రూపొందించాడు అశ్విన్. ఈ ఏడాది జూన్‌లో వచ్చిన 'గేమ్‌ ఓవర్' విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడీ టాలెంటెడ్ డైరెక్టర్ మరోసారి థ్రిల్లింగ్ జానర్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీకి కసరత్తులు మొదలుపెట్టాడట. అయితే ఈసారి కథానాయికగా అక్కినేని కోడలు సమంతను సంప్రదించాడట. సమంతకి కథ కూడా వినిపించాడట అశ్విన్ శరవణన్. ఆ స్టోరీకి ఫిదా అయిన సామ్.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతుంది. మరి ఫీమేల్‌ సెంట్రిక్ మూవీస్‌ స్పెషలిస్ట్ అశ్విన్ శరవణన్ సమంతతో ఎలాంటి సినిమా రూపొందిస్తాడో చూడాలి.