బికినీలో సమంత... మళ్లీ ఫోటోలు వైరల్, గ్యాంగ్‌తో కలిసి గోవాలో చక్కర్లు

  • IndiaGlitz, [Monday,December 27 2021]

జీవితాన్ని నచ్చినట్లుగా కొనుగోలు చేసేవారు కొందరే వుంటారు. అలాంటి వారిలో సమంత కూడా ఖచ్చితంగా వుంటారు. జీవితంలో ఒడిదొడుకులు సహజమే. విజయానికి సంబరపడకుండా.. కష్టానికి కృంగిపోకుండా నిలబడేవాడే జీవితాన్ని గెలుస్తాడు. అలాంటి వారు మనచుట్టూ ఎందరో ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు అగ్ర కథానాయక సమంత. ఇటీవలే భర్త నాగచైతన్యతో ఆమె విడాకులు తీసుకున్నారు. ఎవరి జీవితంలోనైనా వైవాహిక జీవితం అత్యంత కీలకమైనది.

అత్యంత సున్నితమైన ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అది చావు దెబ్బ కొడుతుంది. పోనీ ఏదోలాగా బతికేద్దామని అనుకున్నా.. సమాజం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సమంత సైతం విడాకులు తీసుకున్న తొలినాళ్లలో ఇదే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోర్టుకెక్కితే గానీ లోకం నుంచి ఆమె బయటపడలేదు. అయినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితంపై నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే వుంటుంది. అయితే ఇవేవి పట్టించుకోకుండా తన వృత్తే ప్రధానమని భావించి తిరిగి మామూలు మనిషిగా మారుతున్నారు సామ్.

ఎవరెమనుకున్నా సరే తనకు నచ్చినట్లు వుంటున్నారు సమంత. గతంలో మాల్దీవులు వెళ్లినప్పుడు బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సమంత. తాజాగా మరోసారి బికినీ లాంటి మోనోకినీ ధరించిన ఫొటోను షేర్ చేశారు సామ్. ఆ ఫోటోలో ఆమెతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ స్టయిలిస్ట్ శిల్పా రెడ్డి, మోడల్ అండ్ ఎంట్రప్రెన్యూర్ వాసుకి పుంజ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరు ముగ్గురూ గోవాలో విహరిస్తున్నారు. త్వరలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఈ గ్యాంగ్ అక్కడే ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఇకపోతే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ సమంతకు జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు అవార్డు కూడా తీసుకొచ్చింది. దీనితో పాటు హాలీవుడ్ మూవీకి సైతం సమంత సైన్ చేశారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప: ద రైజ్'లో సామ్ చేసిన 'ఊ అంటావా... ఊఊ అంటావా' సాంగ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట తెలుగు నాట మాస్ జనాలకు పూనకాలు తెప్పిస్తోంది.

More News

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బాలయ్య ప్రశంసల వర్షం.. కానీ..!!!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటించిన ‘‘అఖండ’’ సూపర్‌హిట్ కావడంతో చిత్ర యూనిట్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను చుట్టేస్తున్నారు బాలయ్య.

అఖిల్ కంప్లీట్ మేకోవర్.. అచ్చం హాలీవుడ్ హీరోలాగా, ఆ కండలేంటీ బాబోయ్

తెలుగు చిత్ర సీమలోని పెద్ద కుటుంబాల్లోని ఒకటైన అక్కినేని ఫ్యామిలి వారసుడు ‘‘అఖిల్’’ హిట్టు అందుకోవడానికి ఏళ్ల  పాటు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాడు.

కిందపడేసేలోపు మూడుసార్లు కరిచింది.. పాముకాటుపై స్పందించిన సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను పాము కరిచిన వార్తతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం... ప్రముఖ సింగర్ కన్నుమూత

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పలువురు ప్రముఖులు కన్నుమూశారు.

‘‘రాధేశ్యామ్’’ కోసం తమన్‌ను దించిన యూవీ క్రియేషన్స్.. బీజియమ్ అదిరిపోవాలంతే...!!

ఈ మధ్యకాలంలో తమన్ సాంగ్స్, బీజియమ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి పేరొస్తున్న సంగతి తెలిసిందే.