తన కష్టమే తనకు రక్ష అంటున్న సామ్...
Send us your feedback to audioarticles@vaarta.com
`ఏ మాయ చేశావె` సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన చెన్నై సొగసరి సమంత. తదుపరి స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్గా సక్సెస్‌లను సొంతం చేసుకుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారింటి కోడలైన సమంత.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంది. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో చేసిన `యు టర్న్` ఈ నెల 13న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ `` నా కష్టమే నా సక్సెస్‌కు కారణం. నైపుణ్యం, కృషికే మార్కులు ఇస్తారు. కష్టపడటమే మాత్రమే నాకు తెలుసు. ఎవరూ ఎవరికీ సహాయం చేయరు. పెళ్లి తర్వాత నా బలం పెరిగింది. ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నాను. చైతన్య తన సినిమా శైలజారెడ్డి అల్లుడు ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఆయన యు టర్న్ మూవీ చూడలేదు` అంటూ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout