వచ్చేవారం నుంచే... వర్క్ మోడ్
- IndiaGlitz, [Saturday,October 06 2018]
పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా మధురానిభూతిని మిగులుస్తుంది. అలాంటి అన్యోన్య దాంపత్యం గురించి నాగచైతన్య, సమంత త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా పేరు 'మజిలీ' అనే టాక్ వినిపిస్తోంది. 'నిన్ను కోరి' సినిమాలో దంపతుల మధ్య ఉండాల్సిన అండర్స్టాండింగ్ ని న్యూ ఏజ్ స్టోరీగా తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
సమంత, నాగచైతన్య ఇటీవల హాలీడేని ఎంజాయ్ చేసొచ్చిన సంగతి తెలిసిందే. ఇంకో వారం రోజుల్లోనే వారిద్దరూ కలిసి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. బాలీవుడ్ నటి దివ్యాంశ కౌశిక్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. 'ఏమాయ చేసావె', 'ఆటోనగర్ సూర్య', 'మనం' తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా ఇదే. పెళ్లయిన తర్వాత ఈ దంపతులకు ఇదే తొలి చిత్రం కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.