వచ్చేవారం నుంచే... వర్క్ మోడ్
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా మధురానిభూతిని మిగులుస్తుంది. అలాంటి అన్యోన్య దాంపత్యం గురించి నాగచైతన్య, సమంత త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా పేరు `మజిలీ` అనే టాక్ వినిపిస్తోంది. `నిన్ను కోరి` సినిమాలో దంపతుల మధ్య ఉండాల్సిన అండర్స్టాండింగ్ ని న్యూ ఏజ్ స్టోరీగా తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
సమంత, నాగచైతన్య ఇటీవల హాలీడేని ఎంజాయ్ చేసొచ్చిన సంగతి తెలిసిందే. ఇంకో వారం రోజుల్లోనే వారిద్దరూ కలిసి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. బాలీవుడ్ నటి దివ్యాంశ కౌశిక్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. `ఏమాయ చేసావె`, `ఆటోనగర్ సూర్య`, `మనం` తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా ఇదే. పెళ్లయిన తర్వాత ఈ దంపతులకు ఇదే తొలి చిత్రం కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com