సమంత.. రెండు చోట్లా..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న కథానాయికల్లో సమంత ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో రెండు సినిమాలు దీపావళి సీజన్‌కి.. రెండు సినిమాలు సంక్రాంతి సీజన్‌కి విడుదల కానుండడం విశేషం. దీపావళి టైంలో వచ్చే రెండు సినిమాల్లో.. ఒకటి తెలుగు చిత్రమైన రాజుగారి గది2 కాగా, మరొకటి తమిళ చిత్రం మెర్సల్.
మనం తరువాత నాగార్జునతో మరోసారి కలిసి నటించిన రాజుగారి గది2 అక్టోబర్ 13న విడుదల కానుండగా.. విజయ్‌తో నటిస్తున్న మెర్సల్ (తెలుగులో అదిరింది) అక్టోబర్ 18న విడుదల కానుంది. ఇవి రెండు కూడా దీపావళి సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమాలే.
ఇక సంక్రాంతికి వచ్చే సినిమాల సంగతికి వస్తే.. రామ్‌చరణ్‌తో నటిస్తున్న రంగస్థలం, విశాల్‌తో నటిస్తున్న తమిళ చిత్రం ఇరుంబు తిరై చిత్రాలు పొంగల్‌కి విడుదల అయ్యే దిశగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. మొత్తానికి సమంత.. రెండు చోట్లా రెండు పండగల సందర్భాల్లో సందడి చేయనుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments