షకీలాగా షేక్ చేయనున్న సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
క్యూట్ గర్ల్ సమంత.. షకీలాగా సందడి చేయబోతోంది. 'నీ పేరేంట'ని అడగడం ఆలస్యం.. 'షకీలా' అంటూ హై ఎనర్జీ లెవల్స్‌తో చెప్పుకొచ్చే పాత్రలో సమంత వెండితెరపై కనిపించనుంది. అయితే ఇదేదో హాట్ స్టార్ షకీలా నిజజీవిత గాధతో తెరకెక్కే సినిమా కోసం అనుకుంటే పొరపాటే. తమిళంలో విక్రమ్ కథానాయకుడుగా '10 ఎండ్రత్తుకుల్ల' పేరుతో ఓ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇందులో కళ్లద్దాలతో కొత్తకొత్తగా సమంత కనిపించనుంది. అంత కొత్తగా కనిపిస్తున్న సందర్భంలో.. పేరు కూడా రెగ్యులర్‌గా ఉండకూడదు అనుకుందేమో షకీలా పేరుతో పలకరించబోతోంది సమంత.
2 గంటల 24 నిమిషాల పాటు సాగే ఈ సినిమా 'క్లీన్ యు' సర్టిఫికేట్ పొంది.. ఈ నెల 21న విడుదలకు ముస్తాబవుతోంది. తెలుగులోనూ ఈ సినిమా డబ్ అయ్యే అవకాశం ఉంది. అంటే..షకీలాగా సమంత చేసే సందడిని మనం కూడా ఎంజాయ్ చెయ్యొచ్చన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com