ముస్లీం అమ్మాయిగా సమంత?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో చేసిన తొలి చిత్రం 'ఏమాయ చేసావె' కోసం క్రిస్టియన్ గర్ల్ జెస్సీగా విశేషంగా ఆకట్టుకుంది అందాల నటి సమంత. ఆ తరువాత పలు చిత్రాల్లో హిందూ అమ్మాయిగా కనువిందు చేసింది. ఈ వరుసలోనే ఓ సినిమా కోసం పక్కా ముస్లీం అమ్మాయిగా సమంత సందడి చేయనుందని సమాచారం. విజయ్ హీరోగా రాజా రాణి దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సినిమాలో.. సమంత సంప్రదాయ ముస్లీం గర్ల్‌గా ఆ కట్టుబొట్టుతో కనువిందు చేయనుందని సమాచారం.
మతాంతర వివాహం నేపథ్యంలో విజయ్, సమంతల మధ్య సన్నివేశాలుంటాయని తమిళ తంబీలు ముచ్చటించుకుంటున్నారు. ఇందులో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. అన్నట్టు.. విక్రమ్ '10 ఎండ్రత్తుకుల్ల' లోనూ షకీలా పేరుతో సమంత నటించింది. బహుశా అది కూడా ముస్లీం అమ్మాయి పాత్రే అయిఉండవచ్చని వినిపిస్తోంది. ఏదీఏమైనా.. క్రిస్టియన్, హిందూ, ముస్లీం.. ఇలా మతసామరస్యాన్ని తన పాత్రల ద్వారా బాగానే చూపుతోంది సమంత.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com