70 బామ్మ పాత్రలో సామ్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో మెప్పించిన సమంత పెళ్లి తర్వాత పెర్ఫామెన్స్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. ప్రస్తుతం సమంత యూ టర్న్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు.. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో భర్త నాగచైతన్యతో కలిసి ఓ సినిమా నటించనుంది.
ఇది కాకుండా నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఇది రీమేక్ అని.. ఇందులో అతీత శక్తులున్న వృద్ధురాలు తనకు అవసరమైనప్పుడు అందమైన అమ్మాయిగా మారిపోతుందట. మరి ఇందులో నిజ నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com