స‌మంత అ ఆ చూసిన చైత‌న్య‌..

  • IndiaGlitz, [Thursday,June 02 2016]

నితిన్ - స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించారు. ఈరోజు అ ఆ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. అయితే...చైత‌న్య‌, స‌మంత క‌లిసి ఈరోజు అ ఆ చిత్రాన్ని చూసారంటూ... సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో ఓ ఫోటో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం...చైత‌న్య ఈరోజు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేదట‌. కానీ...అ ఆ చిత్రాన్ని చూసాడ‌ట‌. ఎక్క‌డంటారా..త‌న ఇంట్లోనే హోమ్ థియేట‌ర్ లో క్యూబ్ సిస్ట‌మ్ ద్వారా చూసాడ‌ట‌. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఆ ఫోటో ఈరోజుది కాద‌ట‌. చైతు అ ఆ చిత్రాన్ని ఫ‌స్ట్ డే రోజు చూడ‌డానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం కూడా ఉందండోయ్. అదేమిటంటే...ఈ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ ఫ‌స్ట్ నాగ చైత‌న్య‌తోనే చేయాల‌నుకున్నారు. ఎందుక‌నో ఆఖ‌రి నిమిషంలో నితిన్ ద‌గ్గ‌ర‌కి వెళ్లింది. ఇంత‌కీ అ ఆ చిత్రం పై చైతు స్పంద‌న ఏమిటో ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తాడేమో చూడాలి

More News

జర్నలిస్ట్ గా సమంత

బెంగళూర్ డేస్, థెరి, బ్రహ్మోత్సవం, 24, అఆ సినిమాలతో ఈ ఏడాది సందడి చేసిన హీరోయిన్ సమంత ఓ డిఫరెంట్ రోల్ చేయడానికి రెడీ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన వార్తల్లో యూ టర్న్ అనే మూవీని సమంత నిర్మిస్తూ నటించనుందని వార్తలు వచ్చాయి.

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫ‌స్ట్ లుక్ కి సూప‌ర్బ్ రెస్పాన్స్ - చిత్ర‌యూనిట్

స్వామిరారా, కార్తికేయ‌, సూర్య vs సూర్య లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో టాలీవుడ్ ట్రేండ్ ని మార్చిన యంగ్ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్, 21F ఫేం హెబాప‌టేల్‌, త‌మిళం లో అట్ట‌క‌త్తి, ముందాసిప‌త్తి, ఎధిర్ నీచ‌ల్ ఫేం నందిత స్వేత  ల కాంబినేష‌న్ లో టైగ‌ర్ ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా మేఘ‌న ఆర్ట్స్ ని

బన్ని నిర్మాతతో పవన్...?

ప్రస్తుతం శరత్ మరార్ నిర్మాతగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పవన్ మరో సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి రెఢీ అవుతున్నాడు.

దుబాయ్ లో సాంగ్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న జ‌క్క‌న్న‌

గోల్డెన్‌స్టార్‌ సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న చిత్రం ఇటీవలే దుబాయ్ లోని అంద‌మైన లోకేష‌న్స్ లో జానీ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్ గా సాంగ్ షూటింగ్ జ‌రుపుకుంది. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చ

ప్రభాస్ తో బ్రిటీష్ భామ..

ప్రస్తుతం బాహుబలి2 చిత్రీకరణలో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా తర్వాత రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.