సమంత అ ఆ చూసిన చైతన్య..
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ - సమంత జంటగా నటించిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. ఈరోజు అ ఆ ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. అయితే...చైతన్య, సమంత కలిసి ఈరోజు అ ఆ చిత్రాన్ని చూసారంటూ... సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఓ ఫోటో హల్ చల్ చేస్తుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం...చైతన్య ఈరోజు ఇంటి నుంచి బయటకు రాలేదట. కానీ...అ ఆ చిత్రాన్ని చూసాడట. ఎక్కడంటారా..తన ఇంట్లోనే హోమ్ థియేటర్ లో క్యూబ్ సిస్టమ్ ద్వారా చూసాడట. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో హల్ చల్ చేస్తున్న ఆ ఫోటో ఈరోజుది కాదట. చైతు అ ఆ చిత్రాన్ని ఫస్ట్ డే రోజు చూడడానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉందండోయ్. అదేమిటంటే...ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ ఫస్ట్ నాగ చైతన్యతోనే చేయాలనుకున్నారు. ఎందుకనో ఆఖరి నిమిషంలో నితిన్ దగ్గరకి వెళ్లింది. ఇంతకీ అ ఆ చిత్రం పై చైతు స్పందన ఏమిటో ట్విట్టర్ ద్వారా తెలియచేస్తాడేమో చూడాలి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com