సమంత, అమీతో పాటు...
Send us your feedback to audioarticles@vaarta.com
క్యూట్ గర్ల్స్ సమంత, అమీ జాక్సన్ రెండు తమిళ సినిమాల కోసం కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా 'రాజా రాణి' దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రంతో పాటు.. ధనుష్ 'తంగమగన్'లోనూ ఈ ఇద్దరూ హీరోయిన్స్‌గా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. విశేషమేమిటంటే.. ఈ ఇద్దరితో పాటు ఈ రెండు సినిమాల్లోనూ మరో కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే.. నిన్నటి తరం అగ్ర కథానాయిక, నేటి తరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించడం. రాధికాతో తెరను పంచుకునే విషయం గురించి ఈ ముద్దుగుమ్మలిద్దరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. ఆమెతో కలిసి తీసుకున్న సెల్ఫీలను సోషల్ నెట్వర్క్ సైట్స్‌లో పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments