‘‘S’’ పోయి ‘‘Samantha’’ వచ్చే... సోషల్ మీడియా హ్యాండిల్స్లో తన పేరును మళ్లీ మార్చిన సామ్
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్యతో విడాకుల నేపథ్యంలో హీరోయిన్ సమంత సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరును మార్చుకున్నారు. నిన్నటి వరకు ఎస్(S) అనే అక్షరాన్ని మాత్రమే ఉంచిన ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు మళ్ళీ సమంత(Samantha)అని పేరును మార్చింది. నాగ చైతన్యతో పెళ్ళికి ముందు సమంత సోషల్ మీడియా ఖాతాలకు సమంత రుతు ప్రభు అనే పేరు ఉండేది. కానీ, 2017లో నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత.. తన పేరుకు అక్కినేని చేర్చుకొని (samantha akkineni)గా సోషల్ మీడియాలో పేరును మార్చింది.
సమంత-నాగచైతన్య మధ్య ఏదో జరుగుతుందన్న దానిని బయటి ప్రపంచానికి తెలియజేసింది కూడా సోషల్ మీడియానే. కొద్దినెలల క్రితం ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో samantha akkineniకి బదులుగా (S) అనే అక్షరాన్ని వుంచడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. దాదాపు రెండు నెలల పాటు మీడియాలో కథనాలు వస్తున్నా.. ఇద్దరూ దీనిపై స్పందించలేదు. చివరికి అంతా వీటిని పుకార్లుగానే నమ్ముతున్న సమయంలో నిన్న ఈ జంట షాకిచ్చింది. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతూ తాము విడాకులు తీసుకుంటున్నట్లు నాగచైతన్య ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఇక పీకల్లోతు ప్రేమలో ఉన్న సమయంలో ఇద్దరూ తమ చేతుల మీద పచ్చబొట్టు వేసుకున్నారు. నాగచైతన్య చేతి మీద సమంత పేరుతో టాటూ ఉంటే.. సమంత చేతి మీద నాగచైతన్య పేరుతో టాటూ ఉంది. కానీ విడాకులకు ముందే తన చేతిపై ఉన్న టాటూను చెరిపేశాడు నాగచైతన్య. ఇటీవల చైతూ పాల్గొన్న ప్రమోషన్ కార్యక్రమాల్లో మీడియా కెమెరాలు ఈ విషయాన్ని గుర్తించాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com