‘‘S’’ పోయి ‘‘Samantha’’ వచ్చే... సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన పేరును మళ్లీ మార్చిన సామ్

  • IndiaGlitz, [Sunday,October 03 2021]

నాగచైతన్యతో విడాకుల నేపథ్యంలో హీరోయిన్ సమంత సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరును మార్చుకున్నారు. నిన్నటి వరకు ఎస్(S) అనే అక్షరాన్ని మాత్రమే ఉంచిన ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు మళ్ళీ సమంత(Samantha)అని పేరును మార్చింది. నాగ చైతన్యతో పెళ్ళికి ముందు సమంత సోషల్ మీడియా ఖాతాలకు సమంత రుతు ప్రభు అనే పేరు ఉండేది. కానీ, 2017లో నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత.. తన పేరుకు అక్కినేని చేర్చుకొని (samantha akkineni)గా సోషల్ మీడియాలో పేరును మార్చింది.

సమంత-నాగచైతన్య మధ్య ఏదో జరుగుతుందన్న దానిని బయటి ప్రపంచానికి తెలియజేసింది కూడా సోషల్ మీడియానే. కొద్దినెలల క్రితం ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో samantha akkineniకి బదులుగా (S) అనే అక్షరాన్ని వుంచడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. దాదాపు రెండు నెలల పాటు మీడియాలో కథనాలు వస్తున్నా.. ఇద్దరూ దీనిపై స్పందించలేదు. చివరికి అంతా వీటిని పుకార్లుగానే నమ్ముతున్న సమయంలో నిన్న ఈ జంట షాకిచ్చింది. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతూ తాము విడాకులు తీసుకుంటున్నట్లు నాగచైతన్య ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ఇక పీకల్లోతు ప్రేమలో ఉన్న సమయంలో ఇద్దరూ తమ చేతుల మీద పచ్చబొట్టు వేసుకున్నారు. నాగచైతన్య చేతి మీద సమంత పేరుతో టాటూ ఉంటే.. సమంత చేతి మీద నాగచైతన్య పేరుతో టాటూ ఉంది. కానీ విడాకులకు ముందే తన చేతిపై ఉన్న టాటూను చెరిపేశాడు నాగచైతన్య. ఇటీవల చైతూ పాల్గొన్న ప్రమోషన్ కార్యక్రమాల్లో మీడియా కెమెరాలు ఈ విషయాన్ని గుర్తించాయి.

More News

పాతికేళ్ల ప్రేమకావ్యం నిన్నే పెళ్లాడతా ... స్టార్ మా లో !!

"నిన్నే పెళ్లాడతా"... ప్రతి తెలుగు ఇంటిలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. రెండు కుటుంబాలు; శీను, పండు అనే ఇద్దరు పంచుకున్న జ్ఞాపకాల ఆల్బమ్ లాంటి సినిమా.

బిగ్‌బాస్ 5 తెలుగు: నలుగురు సేఫ్.. మరో నలుగురు డేంజర్ జోన్‌లో, రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరో..?

బిగ్‌బాస్ హౌస్ శనివారం కాస్త సీరియస్‌గా, ఇంకాస్త ఎంటర్‌టైనింగ్‌గా, ఉత్కంఠగా సాగింది. ఈ వారం అతి చేసిన వారికి నాగార్జున క్లాస్ పీకారు.

ఐశ్వర్య ఆర్‌. ధనుష్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ స్ట్రయిట్‌ తెలుగు సినిమా

భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా... రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ నటించిన ‘2.0’ను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదాతో డేట్‌కు శ్రీరామ్ సై... ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మర్‌గా జెస్సీ

బిగ్‌బాస్ శుక్రవారం ఎపిసోడ్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. హౌస్‌మేట్స్ రూల్ సరిగా పాటించనందుకు గాను జెస్సీ కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని కోల్పోయాడు.

హీరోయిన్‌గా ఫామ్‌లోనే వున్నావుగా.. ఈ కక్కుర్తి ఎందుకు: రష్మిక యాడ్‌పై నెట్టింట ట్రోల్స్

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ‘ఛలో..’ అంటూ టాలీవుడ్‌కు వచ్చి.. ‘గీతగోవిందం’తో గిలిగింతలు పెట్టి..