శ్రుతి హాసన్ తరువాత సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఇలా మెగా ఫ్యామిలీలోని ఈ ముగ్గురు కథానాయకులతోనూ నటించే అవకాశం దక్కించుకున్న కథానాయికలుగా తమన్నా, శ్రుతి హాసన్, కాజల్, సమంతకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే.. ఈ ముగ్గురితోనూ విజయాలు అందుకున్న ఘనత మాత్రం ఇప్పటివరకు శ్రుతి హాసన్‌కే ఉంది. పవన్‌తో 'గబ్బర్ సింగ్', అల్లు అర్జున్ కాంబినేషన్లో 'రేసు గుర్రం', రామ్ చరణ్‌తో 'ఎవడు' చిత్రాలు చేసి.. శ్రుతి ఈ విజయాలు అందుకుంది.
కట్ చేస్తే.. ఈ ఫీట్‌ని తాజాగా సమంత రిపీట్ చేసింది. ఇప్పటికే పవన్‌తో 'అత్తారింటికి దారేది'.. అల్లు అర్జున్‌తో 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలు చేసి విజయాలు అందుకున్న సమంత.. తాజాగా రామ్ చరణ్ కాంబినేషన్లో 'రంగస్థలం' చేసింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి సర్వత్రా మంచి స్పందన వచ్చింది. అంతేగాకుండా.. వసూళ్ళ పరంగా మెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. శ్రుతి హాసన్ తరువాత ఈ ముగ్గురు మెగా హీరోలతో సక్సెస్ అందుకున్న నాయికగా సమంతకి ప్రత్యేక గుర్తింపు దక్కింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com