ఐదేళ్ల తరువాత.. సమంత..
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత గత చిత్రం 'జనతా గ్యారేజ్' విడుదలై సంవత్సరం అవుతోంది. ఆమె నుంచి వచ్చే కొత్త చిత్రం గురించి ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె కొత్త చిత్రం మాత్రం విడుదలయ్యేంది తన పెళ్లి తరువాతే. కథానాయకుడు నాగచైతన్యతో సమంత వివాహం అక్టోబర్ 6న జరగనున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత సరిగ్గా వారం రోజులకు అంటే.. అక్టోబర్ 13న ఆమె ఆత్మ పాత్రలో నటించిన 'రాజు గారి గది 2' విడుదల కానుంది. ఇందులో తనకి కాబోయే మావయ్య నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తుండడం విశేషం. 'మనం' తరువాత నాగ్, సమంత కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. రామ్‌చరణ్‌తో తొలిసారిగా 'రంగస్థలం' అనే సినిమా చేస్తోంది సమంత. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. అదే గనుక జరిగితే ఐదేళ్ల తరువాత సంక్రాంతికి తన సినిమాతో సందడి చేసినట్లవుతుంది సమంతకి. 2013 సంక్రాంతికి సమంత ఓ హీరోయిన్‌గా నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదలై ఘన విజయం సాధించింది. మళ్లీ ఆ సీజన్‌కి వస్తున్న సమంత చిత్రం ఇదే కావడం గమనార్హం. 'రంగస్థలం'కి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com