ఐదేళ్ల తరువాత.. సమంత..

  • IndiaGlitz, [Thursday,August 31 2017]

స‌మంత గ‌త చిత్రం 'జ‌నతా గ్యారేజ్' విడుద‌లై సంవ‌త్స‌రం అవుతోంది. ఆమె నుంచి వ‌చ్చే కొత్త చిత్రం గురించి ఆమె అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె కొత్త చిత్రం మాత్రం విడుద‌ల‌య్యేంది త‌న పెళ్లి త‌రువాతే. క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌తో స‌మంత వివాహం అక్టోబ‌ర్ 6న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత స‌రిగ్గా వారం రోజుల‌కు అంటే.. అక్టోబ‌ర్ 13న‌ ఆమె ఆత్మ పాత్ర‌లో న‌టించిన 'రాజు గారి గ‌ది 2' విడుద‌ల కానుంది. ఇందులో త‌న‌కి కాబోయే మావ‌య్య నాగార్జున ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. 'మ‌నం' త‌రువాత నాగ్‌, స‌మంత క‌లిసి న‌టిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. రామ్‌చ‌ర‌ణ్‌తో తొలిసారిగా 'రంగ‌స్థ‌లం' అనే సినిమా చేస్తోంది స‌మంత‌. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని స‌న్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. అదే గ‌నుక జ‌రిగితే ఐదేళ్ల త‌రువాత సంక్రాంతికి త‌న సినిమాతో సంద‌డి చేసిన‌ట్లవుతుంది స‌మంత‌కి. 2013 సంక్రాంతికి స‌మంత ఓ హీరోయిన్‌గా న‌టించిన 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. మ‌ళ్లీ ఆ సీజ‌న్‌కి వ‌స్తున్న స‌మంత చిత్రం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. 'రంగ‌స్థ‌లం'కి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

More News

'పెళ్లి రోజు' సినిమా ఫస్ట్ లుక్ లాంచ్

'పెళ్లి రోజు' సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా...

'వైశాఖం' బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అయినందుకు సంతృప్తిగా వుంది - సంగీత దర్శకుడు డి.జె. వసంత్

ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం మనవడిగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన డి.జె.వసంత్ 2012 'సుడిగాడు'చిత్రంతో

ఈ సారీ కూడా వదలడం లేదు

'అల్లుడు శీను','జయజానకి నాయక'చిత్రాలతో మాస్ కథానాయకుడిగా తనకంటూ ఓ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు

అర్జున్ రెడ్డికి అనసూయ చురకలు..

ఎమోషల్ లవ్ ఎంటర్ టైనర్ గా విడుదలైన అర్జున్రెడ్డి చిత్రానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

మెగా హీరోతో తేజ...

స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తేజ చాలా కాలం తర్వాత హిట్ మూవీని తెరెక్కించలేకపోయాడు.