పారితోషికం తీసుకోకుండా నటిస్తున్న సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యు టర్న్'. రెండేళ్ళ క్రితం కన్నడంలో విడుదలైన 'యు టర్న్' మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సమంత జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. ఇది తన పెట్ ప్రాజెక్ట్ అని సమంత చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ పెట్ ప్రాజెక్ట్ కోసం ఆమె ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నారట. ఇటీవల కాలంలో.. కొంత మంది స్టార్ హీరోలు పారితోషికానికి బదులు ఏరియా హక్కుల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి బాటలోనే సమంత కూడా వెళ్ళనున్నారట. అయితే.. హక్కుల రూపంలో కాకుండా లాభాల్లో వాటా తీసుకోవాలని అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్టు సమాచారం.
సమంత పారితోషికం లేదు గనక వీలైనంత తక్కువ బడ్జెట్లో సినిమాని నిర్మించడానికి నిర్మాత ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకోగా.. త్వరలో మూడో షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout