పారితోషికం తీసుకోకుండా నటిస్తున్న సమంత

  • IndiaGlitz, [Saturday,April 28 2018]

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యు టర్న్'. రెండేళ్ళ క్రితం కన్నడంలో విడుదలైన 'యు టర్న్' మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సమంత జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. ఇది తన పెట్ ప్రాజెక్ట్ అని సమంత చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ పెట్ ప్రాజెక్ట్ కోసం ఆమె ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నారట. ఇటీవ‌ల కాలంలో.. కొంత మంది స్టార్ హీరోలు పారితోషికానికి బదులు ఏరియా హక్కుల్ని తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వారి బాటలోనే సమంత కూడా వెళ్ళ‌నున్నార‌ట‌. అయితే.. హక్కుల రూపంలో కాకుండా లాభాల్లో వాటా తీసుకోవాలని అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్టు సమాచారం.

సమంత పారితోషికం లేదు గనక వీలైనంత తక్కువ బడ్జెట్‌లో సినిమాని నిర్మించడానికి నిర్మాత ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకోగా.. త్వరలో మూడో షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More News

ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా..'ఈ నగరానికి ఏమైంది'

'పెళ్ళి చూపులు'తో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

మేడే సందర్భంగా వి. వి. వినాయ‌క్ చేతుల మీదుగా 'శంభో శంక‌ర‌' తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్

శంక‌ర్ హీరోగా శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌క‌త్వంలో  ఆర్.ఆర్ . పిక్చ‌ర్స్ సంస్థ   ఎస్. కె. పిక్చ‌ర్స్ సమ‌ర్ప‌ణ‌లో నిర్మిస్తోన్న చిత్రం  'శంభో శంక‌ర‌'.

చ‌ర‌ణ్ మూడోసారీ హిట్ కొడ‌తాడా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇప్ప‌టివ‌ర‌కు సంక్రాంతి సీజ‌న్ బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి.  ఇప్ప‌టికే ఈ పండ‌గ సంద‌ర్భంలో వ‌చ్చిన‌ రెండు సినిమాల‌తోనూ విజ‌యం సాధించారు ఈ యంగ్ హీరో.

నివేదా హీరోయిన్ కాద‌ట‌

'జెంటిల్‌మన్', 'నిన్నుకోరి', 'జై లవకుశ' చిత్రాల‌తో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది కేర‌ళ‌ కుట్టి నివేదా థామస్.

మ‌హేష్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్‌

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'  బాక్సాఫీస్ వ‌ద్ద‌ విజయం వైపు పరుగులు తీస్తోంది.