సెకండ్ టైమ్ ట్రై చేస్తోన్న సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
నటిగా ఆరేళ్ల ప్రయాణంలో.. దాదాపు 30 సినిమాలతో సందడి చేసింది చెన్నై పొన్ను సమంత. అయితే.. వీటిలో నాలుగైదు సినిమాలను మినహాయిస్తే.. మిగిలివన్నీ హీరోతో పాటలు పాడుకోవడానికే మాత్రమే పనికొచ్చే వేషాలనో.. లేదంటే అతిథి వేషాలనో వేసిందీ అమ్మడు. ఇక టైటిల్‌లో తన పాత్ర పేరు వినిపించే సినిమాల సంఖ్య అయితే ఒక్కటంటే ఒక్కటే. అదే 'మాస్కోవిన్ కావేరి' అనే తమిళ సినిమా. 2010లో ఈ సినిమా రిలీజయ్యింది.
'అందాల రాక్షసి', 'అలా ఎలా' ఫేమ్ రాహుల్ రవీంద్రన్ మాస్కోగా నటిస్తే.. సమంత కావేరిగా టైటిల్ రోల్‌లో సందడి చేసింది. కట్ చేస్తే.. మళ్లీ ఆరేళ్ల తరువాత హీరో పాత్ర పేరుతో తన పాత్ర పేరు కూడా వచ్చేలా మరో సినిమా చేస్తోందీ ముద్దుగుమ్మ. అయితే ఈ సారి టైటిల్‌లో కాకుండా.. ట్యాగ్‌లైన్‌లో ఇది చోటు చేసుకోనుంది.
త్రివిక్రమ్ రూపొందిస్తున్న 'అ..ఆ..'లో అకి ట్యాగ్ లైన్ వెర్షన్ అయిన అనసూయ రామలింగంగా సమంత నటిస్తోంటే.. ఆ కి ట్యాగ్ లైన్ వెర్షన్ అయిన ఆనంద్ విహారిగా నితిన్ నటిస్తున్నాడు. టైటిల్‌లో తన పాత్ర పేరు వచ్చేలా సమంత చేసిన మొదటి సినిమా డిజాస్టర్ అయింది. మరి టైటిల్ ట్యాగ్‌లైన్‌లో తన పాత్ర పేరు వచ్చేలా సమంత నటిస్తున్న టైటిల్ రోల్ అనసూయ అయినా ఆమెకి విజయాన్ని కట్టబెడుతుందో లేదో చూడాలి. 'అ..ఆ' మే 6న రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments