సెకండ్ టైమ్ ట్రై చేస్తోన్న సమంత

  • IndiaGlitz, [Wednesday,March 30 2016]

న‌టిగా ఆరేళ్ల ప్ర‌యాణంలో.. దాదాపు 30 సినిమాల‌తో సంద‌డి చేసింది చెన్నై పొన్ను స‌మంత‌. అయితే.. వీటిలో నాలుగైదు సినిమాల‌ను మిన‌హాయిస్తే.. మిగిలివ‌న్నీ హీరోతో పాట‌లు పాడుకోవ‌డానికే మాత్ర‌మే ప‌నికొచ్చే వేషాల‌నో.. లేదంటే అతిథి వేషాల‌నో వేసిందీ అమ్మ‌డు. ఇక టైటిల్‌లో త‌న పాత్ర పేరు వినిపించే సినిమాల సంఖ్య అయితే ఒక్క‌టంటే ఒక్క‌టే. అదే 'మాస్కోవిన్ కావేరి' అనే త‌మిళ సినిమా. 2010లో ఈ సినిమా రిలీజ‌య్యింది.

'అందాల రాక్ష‌సి', 'అలా ఎలా' ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ మాస్కోగా న‌టిస్తే.. స‌మంత కావేరిగా టైటిల్ రోల్‌లో సంద‌డి చేసింది. క‌ట్ చేస్తే.. మ‌ళ్లీ ఆరేళ్ల త‌రువాత హీరో పాత్ర పేరుతో త‌న పాత్ర పేరు కూడా వ‌చ్చేలా మ‌రో సినిమా చేస్తోందీ ముద్దుగుమ్మ‌. అయితే ఈ సారి టైటిల్‌లో కాకుండా.. ట్యాగ్‌లైన్‌లో ఇది చోటు చేసుకోనుంది.

త్రివిక్ర‌మ్ రూపొందిస్తున్న 'అ..ఆ..'లో అకి ట్యాగ్ లైన్ వెర్ష‌న్‌ అయిన అన‌సూయ రామ‌లింగంగా స‌మంత న‌టిస్తోంటే.. ఆ కి ట్యాగ్ లైన్ వెర్ష‌న్ అయిన ఆనంద్ విహారిగా నితిన్ న‌టిస్తున్నాడు. టైటిల్‌లో త‌న పాత్ర పేరు వ‌చ్చేలా స‌మంత చేసిన మొద‌టి సినిమా డిజాస్ట‌ర్ అయింది. మ‌రి టైటిల్ ట్యాగ్‌లైన్‌లో త‌న పాత్ర పేరు వ‌చ్చేలా స‌మంత న‌టిస్తున్న టైటిల్ రోల్ అన‌సూయ అయినా ఆమెకి విజ‌యాన్ని క‌ట్ట‌బెడుతుందో లేదో చూడాలి. 'అ..ఆ' మే 6న రిలీజ్ కానుంది.

More News

బాలయ్య వందో సినిమాలో రాజమాత ఎవరు..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమాని ఉగాది రోజున ప్రకటించనున్న విషయం తెలిసిందే.

అప్పుడు మిస్‌..ఇప్పుడు ఎస్‌..

రెండు ప్ర‌ముఖ కుటుంబాల‌కు చెందిన ఇద్ద‌రు క‌థానాయ‌కులు.. గ‌త నెల మొద‌టివారంలో పోటీకి సిద్ధ‌మ‌య్యారు. అయితే.. అనివార్య కార‌ణాల వ‌ల్ల చివ‌రి నిమిషంలో ఒక‌రి సినిమా మ‌రో వారం రోజుల పాటు వాయిదా ప‌డింది.

నితిన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది..

యువ హీరో నితిన్ పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా  అ ఆ సినిమా ప్ర‌చార చిత్రాల‌ను రిలీజ్ చేసారు. ఇదిలా ఉంటే నితిన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా యువ హీరోలు - స‌న్నిహితులు నితిన్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు.

యు.ఎస్ లో 1 మిలియ‌న్ క్రాస్ చేసిన ఊపిరి

నాగార్జున - కార్తీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. తెలుగు - త‌మిళ్ లో రూపొందిన ఊపిరి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించారు. ఊపిరి సినిమా రిలీజైన రోజు నుంచి అన్నిచోట్లా  ఫీల్ గుడ్ మూవీ అంటూ పాజిటివ్ టాక్తో  ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

'సరైనోడు' తో మళ్లీ అలాగే..

మాస్ మెచ్చే సినిమాలను తీయడంలో బోయపాటి శ్రీను స్టైలే వేరు.తొలి చిత్రం 'భద్ర 'నుంచి గత చిత్రం 'లెజెండ్' వరకు ఆయన మాస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.