సమంత `96` లుక్ ఇదే...
- IndiaGlitz, [Monday,July 22 2019]
సమంత హీరోయిన్‌గా నటిస్తున్న '96' తెలుగు రీమేక్ ఇమేజ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో సమంత తెల్లటి కుర్తా, బ్లూ షాల్‌తో కనిపిస్తున్నారు. రీ యూనియన్‌కు సంబంధించిన వేదికపై మైక్ పట్టుకుని సమంత పాడుతున్నట్టు ఉండే సీన్‌కు సంబంధించిన దృశ్యం ఇది అని టాక్. ఒరిజినల్‌లో సమంత పాత్రను త్రిష చేశారు. శర్వానంద్ పాత్రను విజయ్ సేతుపతి చేశారు. ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో కూడా ఆయనే రీమేక్ చేస్తున్నారు.
'దిల్'రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే శర్వానంద్ ప్రమాదానికి గురయ్యారు. త్వరలోనే మళ్లీ ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నట్టు వినికిడి. 1996లో పదో తరగతి చదివిన బ్యాచ్ మళ్లీ కలుసుకుంటే ఏంటి? అప్పటి జంట మధ్య సాగిన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? అప్పటికే పెళ్లయిన అమ్మాయి, ఆమె జ్ఞాపకాలు వదల్లేక పెళ్లి చేసుకోలేని అబ్బాయి చివరికి ఎలా మిగులుతారు? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.